
”నేను పాకిస్థానీని కాదు” నా గురించి, నా కుటుంబం గురించి తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. నాకు, నా కుటుంబానికి ఆ దేశంతో ఎలాంటి సంబంధం లేదు!”
అని ప్రభాస్ సినిమాలో హీరోయిన్గా కనిపించబోతున్న Emanvi esmail క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా Emanvi esmail నటించనున్నారు.
ఆమె పాకిస్థానీ అంటూ ఆమెను తీసుకోవద్దు అంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఈ విషయం పై Emanvi స్పందించారు.
నాపై ద్వేషాన్ని కలిగించడానికే ఇలాంటి వార్తలు ప్రచురిస్తున్నారు. ఎటువంటి పరిశోధన చెయ్యకుండానే చాలా పెద్ద సంస్థలు కూడా నా గురించి, నా కుటుంబం గురించి ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారు. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు . తాను పాకిస్థానీ నటి కాదని, తన కుటుంబానికి ఆ దేశంతో ఎలాంటి సంబంధం లేదని పోస్ట్ చేసారు.
నేను ఇండోఅమెరికన్ ని. నేను హిందీ , తెలుగు , గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడగలను. మా తల్లిదండ్రులు అమెరికాకు వలసవెళ్లి అక్కడ స్థిరపడ్డారు. నేను లాస్ ఏంజెలెస్ లో పుట్టాను. నా చదువుఅంతా అక్కడే అయింది. చదువు పూర్తయిన తరువాత డాన్సర్ గా, కొరియోగ్రాఫేరగా , నటిగా నా కెరీర్ ని స్టార్ట్ చేశాను. ఇలా ఎంతోకాలం కొనసాగిస్తుండగా నాకు భారతీయా చలన చిత్ర పరిశ్రమలో పనిచేసే అవకాశం అందుకున్నాను. దీనికి నేను చాలా సంతోషపడుతున్నాను. సినిమా నా జీవితంపై చాల ప్రభావం చూపింది.
భారతీయ సంస్కృతి, భారతీయత అనేది నా బ్లడ్ లోనే ఉంది. సోషల్ మీడియాని మంచి కోసం వాడండి అని ఆమె క్లారిటీ ఇచ్చారు.