ఈ మధ్య కాలంలో సహజమైన హాస్యంతో, రియలిస్టిక్ ఎమోషన్‌తో, కమెడియన్ గా మరియు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది అభిమానులను సాధించుకున్న ప్రముఖ తెలుగు నటుడు రాహుల్ రామకృష్ణ.
ఆయన నటించిన ప్రముఖ చిత్రాల్లో “అర్జున్ రెడ్డి”, “భరత్ అనే నేను”, “జాతి రత్నాలు”, “RRR”, “మహానటి” వంటి సినిమాలు చాలా మంచి గుర్తింపు తెచ్చాయి. తన సహజమైన నటన, రియలిస్టిక్ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకుంటారు.

మీడియా రంగం నుంచి సినీ రంగంలో అడుగు:
సినిమాల్లోకి రాక ముందు జర్నలిజం రంగంలో కూడా పని చేశారు. సామాజిక అంశాలపై ఎప్పుడు రియాక్ట్ అవుతూ స్పష్టంగా చెప్పే వ్యక్తిగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు.
Actor Rahul Ramakrishna tweet viral:
అయితే తాజాగా ఈమధ్య X లో తను ట్వీట్ చేసిన దాని బట్టి చుస్తే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు అన్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి.
ఆ పోస్ట్ కీ 98,000 పైగా వ్యూస్, 2000 లైక్స్ కేవలం రెండు గంటల్లోనే వచ్చాయి.
అసలు ఆ పోస్ట్ లో ఏముంది ? ఎందుకింత ట్రేండింగ్ అయింది అని చుస్తే అర్థమవుతుంది!
”హైదరాబాద్ మునిగిపోయింది.. మీ వాగ్దానాలు అన్నీ విఫలమయ్యాయి. @KCRBRSPresident ప్రజలు మిమల్ని పిలుస్తున్నారు అన్నిటినీ క్రమబద్దీకరించండి”. అనీ ట్వీట్ చేసాడు.
అలాగే మరో ట్వీట్ లో ”మనం చాలా భయంకరమైన కాలం లో జీవిస్తున్నాము. వేచి ఉండలేను.. వచ్చి పరిస్థితులను చక్కగా చెయ్యండి @ KCRBRS ”. అనీ పేర్కొన్నాడు. ”ఇప్పుడు నన్ను చంపేయండి, నాకు ఏమీ ఆశ లేదు .. !” అనీ కేటీర్ ను రక్షకుడిగా పిలుస్తూ పోస్ట్ చేసాడు.
అయితే మరో పోస్ట్ కూడా చేసాడు. అదేంటంటే “ఈ ప్రపంచంలో ద్వేషం ఉండకూడదు.. మనం మానవులమే.. ప్రేమతో జీవించాలి!” అనీ శాంతి సందేశం ఇచ్చాడు. అయితే రాహుల్ చేసిన ఈ ట్వీట్స్ లు రాజకీయ రంగంలో ఆందోళన కలిగిస్తున్నాయి.