లగ్జరీకి లిమిట్ లేదు! నీతా అంబానీ వాడే హ్యాండ్ బ్యాగ్ ధర 17 కోట్లు అని వింటే ఎవరికైనా షాక్ అవుతారు. అవునండి మీరు విన్నది, చదివింది నిజమే ఈ విలువైన డిజైనర్ బ్యాగ్ ప్రపంచంలో మరో ఇద్దరి దెగ్గర మాత్రమే ఉంది.

Nitha Ambani festive look:

ఈ దివాలీ పార్టీకి నీతా అంబానీ , రాధిక మర్చంట్ అందంగా మురిసిపోయారు. ప్రత్యేక దుస్తుల్లో, అలంకరణతో అందరినీ ఆకర్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇందులో స్పెషల్ గా నీతా అంబానీ 61 ఏళ్ల వయసులో కూడా తనదయిన ఫ్యాషన్ స్టైల్‌తో ఆకట్టుకున్నారు. అలాగే తాను వాడే ఈ బ్యాగ్ స్పెషలిటీ ఏంటో తెలుసా? ఆమె బ్యాగ్ ప్రత్యేకించి వైట్ గోల్డ్‌తో తయారైంది. అందులో 3 వేల వజ్రాలు ధగధగ మెరుస్తూ అందరిని ఆకట్టుకున్నాయి. ఈ లగ్జరీ బ్యాగ్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది.