ఫీల్ గుడ్ మూవీ లా, విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీలా అలరిస్తుంది ఈ కన్యాకుమారి మూవీ. ఈ మూవీ లో గీత సైని, శ్రీ చరణ్ రాచకొండ జంటగా నటించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో మరియు ఆహా ott లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కి దర్శకత్వం వహించింది పుష్పక విమానం ఫేమ్ ‘సృజన్‘.

స్టోరీ :
అసలు ఈ కన్యాకుమారి ఎవరు? ఎందుకు అంత మిస్టరీ?
తిరుపతి, కన్యాకుమారి అనే ఇద్దరు హీరో, హీరోయిన్ కేరక్టర్స్ వీరిద్దరూ ఒకే ఊరిలో చదువుకుంటారు. తిరుపతికి చిన్నపటినుంచి కన్యాకుమారి అంటే ఇష్టం.
కానీ కన్యాకుమారికి చిన్నపటినుంచి చదువుకోవడం ఒక మంచి software ఉద్యోగం చేయాలిని ఆశగా ఉండేది. కానీ కన్యాకుమారి ఇంట్లో పరిస్థితులు తనకు అనుగుణంగా ఉండక డిగ్రీ చదివీ ఒక బట్టల షాప్ లో జాబ్ చేస్తూ ఉంటుంది.
ఇంకోవైపు తిరుపతి ఏమో 7వ తరగతికే చదువు మానేసి వ్యవసాయం చేస్తాడు. తనకు వ్యవసాయం చెయ్యడం అంటే ఇష్టం. ఏది ఇలావుండగా తిరుపతి రైతు అవ్వడం వల్ల పెళ్లి సంబంధాలు కుదరవు. మధ్యలో ఒకసారి తన ఫ్రెండ్ ద్వారా చిన్నప్పటి తనకు ఇష్టం అయినా కన్యాకుమారి పరిచయం అవుతుంది.

కన్యాకుమారిని ప్రేమిస్తాడు! తనకు నచ్చక పోయిన కన్యాకుమారి కోసం ఆ అమ్మాయి చేసే బట్టల షాపులోనే జాబ్ చేస్తాడు. కానీ కన్యాకుమారి మాత్రం తిరుపతిని లవ్ చెయ్యాలా ? లేక తాను సాదించాలనుకున్నా సాఫ్ట్వేర్ జాబ్ కోసం చూడాలా? అనే దిగ్బంధంలో ఉంటుంది. ఈ లోపు కన్యాకుమారి ఇంట్లో సంబంధాలూ చూస్తారు. వచ్చిన వాడు software ఉద్యోగి, తనకు software అవ్వేదానికి హెల్ప్ చేస్తాడు అనీ ఆ సంబంధానికి ఒప్పుకుంటుంది.
మరీ కన్యాకుమారి పెళ్లి అయ్యిందా ? తిరుపతి-కన్యాకుమారి ప్రేమ ఫలించిందా? కన్యాకుమారి software ఇంజనీర్ అయ్యిందా? తిరుపతి వ్యవసాయంలో సెటిల్ అయ్యాడా ? అనేది తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే!