Niharika second marriage రెండో పెళ్ళికి సిద్దమైన నిహారిక! మెగా డాటర్ పెళ్లి అతనితోనే.. !
మెగా ఫ్యామిలీ కూతురు ముఖ్యంగా నాగబాబు కూతురు నిహారిక.. హీరోయిన్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయినా ప్రస్తుతం నిర్మాతగా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. నిహారిక నిర్మాణం వహించిన కమిటీ కుర్రాళ్లు చిత్రం మంచి విజయం సాధించింది. అది అందరికి తెలిసిందే!

ఎప్పుడూ నిహారిక సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటుంది. కొన్ని రోజులుగా నిహారిక మరోసారి పెళ్లి పీటలెక్కబోతుందనే వార్తలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ మధ్య ఒకసారి నాగబాబు మాట్లాడుతూ తన కూతురి పెళ్లి గురించి ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. ఈసారి బయట వ్యక్తికి ఇవ్వాలి అనుకోవడం లేదని.. కాబట్టి సొంత బంధువులకే నిహారికను ఇచ్చి పెళ్లి చెయ్యాలి అన్న ఆలోచనలో ఉన్నారని వినికిడి. అయితే దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు, పెళ్లి గురించి డీటైల్స్ రాబోయే రోజుల్లో బయటకు రావచ్చని అంటున్నారు.

