నేచురల్ స్టార్ నాని ఇపుడు కొత్త కొత్త సినిమాలతో చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నారు. మాములుగా నానికి యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.
Jagapathi babu comments on Nani affairs

రీసెంట్ గా నాని హిట్ 3 సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాస్ లుక్, యాక్షన్, వయలెన్స్ తో మైండ్ బ్లాక్ చేశారు. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించడం విశేషం. మే 01 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద రూ.120 కోట్లు పైనే వసూలు చేసింది. ప్రస్తుతం దసరా మూవీ దర్శకుడు శ్రీకాంత్ తో మరో కొత్త మూవీ షూటింగ్ లో లో బిజీగా ఉన్నారు నాని.
ఈ క్రమంలో సీనియర్ నటుడైన జగపతిబాబు కొత్తగా ఒక షో నిర్వయిస్తున్నారు అదే జయమ్ము నిశ్చయమ్మురా.
ఇప్పటికే ఈ రియాలిటీ షోకు అక్కినేని నాగార్జున, శ్రీలీలా హాజరై సందడి చేస్తున్నారు. తమ వ్యక్తిగత విషయాలు, కాంట్రవర్సీల విషయాలపైనా కూడా స్పందించారు. జగపతి బాబు అడిగిన షాకింగ్ ప్రశ్నలకు, నిర్భయంగా సమాధానాలు ఇస్తూ వచ్చారు.

ఈ క్రమంలో తాజాగా నాని ఈ షోకు హాజరయ్యారు. నాని కూడా ఈ షోలో ఎంతో నిర్మొహమాటంగా, నిర్భయంగా సమాధానాలు ఇస్తూ చక్కగా మాట్లాడారు.
ఈ ఎపిసోడ్ విషయానికి వస్తే జగపతి బాబు మాట్లాడుతూ నాని ని నువ్వు నన్ను మొదటిసారి ఎక్కడ కలిసావు అని అడగగా దానికి నాని నాకు గుర్తులేదు అని బదులిస్తాడు . దానికి జగపతిబాబు దెబ్బ తిన్నది నేనే కాబట్టి నాకే గుర్తువుంటది అని అంటాడు .

ఈ విధంగా షో పోతుండగా ఒక id కార్డు తెపిస్తాడు అది చూసి నాని ఇవన్నీ ఎక్కడ దొరకబటారు సర్ అని అంటాడు . అంతలోపు వాళ్ల ఫ్రెండ్ ని పిలిపిస్తాడు దానికి నాని సర్ప్రైస్ గా ఫీలవుతూ రేష్మి అనే అమ్మాయి గురించి అడుగుతాడు ఇంకా ఎప్పటి వరకు ఎంత మంది అమ్మాయిలు కి ఐ లవ్ యూ చెప్పావు అని ప్రశ్నిస్తాడు జగపతి బాబు, దానికి సమాధానం ఈ వారం వచ్చే షో లో తెలుస్తుంది.